అమెరికాకు సునామీ ప్రమాదం పొంచి ఉంది.. సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం కారణంగా అమెరికాకు సునామీ ప్రమాదం ఉందని.. ఆ దేశ సముద్ర, వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికాను ఆనుకుని ఉన్న మహాసముద్రంలో 7.4 రిక్టర్ స్కేలు పరిమాణంలో భూకంపం వచ్చింది.. దీని కారణంగా అమెరికాలోని అలస్కా ప్రాంతానికి సునామీ ప్రమాదం ఉందని ఆ దేశ సముద్ర, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో భూకంపాలు వచ్చినప్పుడు సునామీలు ఏర్పడటం సహజమే.
అయితే.. ఈ సునామీ వచ్చే అవకాశం ఉన్న అలస్కా ప్రాంతం అంతగా జనం ఉండే ప్రాంతం కాదు.. వాస్తవానికి ఇది ప్రధాన అమెరికా భూభాగానికి చాలా దూరంగా ఉంటుంది. దీనివల్ల ప్రధాన అమెరికా భూభాగానికి వచ్చిన ముప్పేమీ లేదని అమెరికా అధికారులు తెలిపారు.
అలస్కా ప్రాంతానికి చాలా విశిష్టత ఉంది. ఇది కెనడాను ఆనుకుని ఉంటుంది. అలస్కా అమెరికాకు చెందిన భూభాగమే అయినప్పటికీ... అలస్కాకు, ప్రధాన అమెరికా భూభాగానికి మధ్య కెనడా ఉంటుంది.
Tsunami warning issued as 7.4 earthquake hits off Alaska: National Oceanic and Atmospheric Administration. #UnitedStates pic.twitter.com/B2WHXH08g9
— ANI (@ANI) July 22, 2020