ఆంధ్రజ్యోతి అంటే ఊరికే జగన్ ను విమర్శిస్తూ రాతలు రాస్తారని అంతా అంటుంటారు కానీ.. ఆ పత్రిక ఎంపీ రాధాకృష్ణ అప్పుడప్పుడూ నిజాలు చాలా నిఖార్సుగా చెబుతుంటారు. ఎప్పుడూ జగన్ ను విమర్శించడమే కాదు.. అప్పుడప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు కూడా. ఏంటీ నమ్మడం లేదా.. అయితే ఈ వారం కొత్త పలుకు చూడండి మీకే తెలుస్తుంది. 

 


ఊరికే జగన్ ను మెచ్చుకోవడం కాదు.. ఏకంగా పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ కంటే జగనే మంచి పేరు కొట్టేశాడని రాసేశారు. అయితే రాధాకృష్ణ ఆ విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు కానీ.. మొత్తానికి కేసీఆర్ కంటే జగనే జనంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అది వాస్తవం కాకపోయినా అంటూ మెలికిపెట్టేశారు. 

 


ఇంతకీ రాధాకృష్ణ ఏమంటున్నారంటే.. “ తెలంగాణలో అతి తక్కువ పరీక్షలు జరుగుతుండగా, ఏపీలో జగన్‌ ఎక్కువ పరీక్షలు చేయిస్తున్నారు అని తెలుగు ప్రజలే కాకుండా, జాతీయ మీడియా కూడా భావించింది. సేకరించిన శాంపిల్స్‌ ఆధారంగా అందరిలో ఇటువంటి అభిప్రాయం ఏర్పడింది.”  "భారీగా శాంపిల్స్‌ను సేకరించడం అనే చర్య ద్వారా కేసీఆర్‌ కంటే తానే బాగా పనిచేస్తున్నాను అన్న పేరును జగన్‌ తెచ్చుకున్నారు.” అంటూ ఇష్టం లేకపోయినా జగన్ కు అనుకూలంగా రాసేశారు. 

 

అలాగే ఇంకోచోట.. “ కాలు, చేయి విరగడం ఒక్కటే అయినా ప్రొసీజర్లను బట్టి వాటన్నింటినీ ఈ ఆరోగ్యశ్రీ కవర్ చేసే 2,200 జబ్బుల్లో  కలిపేశారు. అంతేగానీ కొత్త రోగాలు కాదు. ఈ సూక్ష్మం తెలియని ప్రజలు మాత్రం రెండు వేల రెండు వందల జబ్బులను జగనన్న ఆరోగ్యశ్రీలో చేర్చారు అని సంబరపడిపోతున్నారు. మిగతా సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది. అమలులో ఉన్న పథకాలను రద్దు చేసి కొత్తవాటికి రూపకల్పన చేసి నగదు బదిలీ చేస్తున్నారు. దీనితో మా ఖాతాలో అంత డబ్బు పడింది.. ఇంత డబ్బు పడింది అని జనం మురిసిపోకుండా ఎలా ఉంటారు? గతంలో కేసీఆర్‌ అనుసరించిన మోడల్‌ను గమనించిన జగన్‌ రెడ్డి ఇప్పుడు దాన్ని మరింత విస్తృతపరిచి అమలుచేస్తున్నారు. ఫలితంగా కేసీఆర్‌ కంటే జగన్‌ పనితీరు మెరుగ్గా ఉందన్న అభిప్రాయం విస్తరిస్తోంది.” అంటున్నారు ఆర్కే. 

 


అంటే జగన్ జనాన్ని మోసం చేస్తున్నాడు.. కానీ ఆ విషయం తెలియడం లేదు. అందుకే జగన్ కేసీఆర్ కంటే జగనే బాగా పని చేస్తున్నాడని అనుకుంటున్నారు.. అంటూ తన తెలివితేటలన్నీ చూపిస్తూ కంక్లూజన్ ఇచ్చేశారు రాధాకృష్ణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: