ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తైంది. ఇప్పటికే 90 శాతానికి పైగా జగన్ సర్కార్ హామీలను నెరవేర్చటంతో ప్రజలు అధికార పార్టీ పాలనపై సంతృప్తితో ఉన్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు, టీడీపీ యువనేత మాగంటి రామ్జీ ట్విట్టర్ వేదిక గా జగన్ పై ఘాటు విమర్శలు చేశారు.
నేడు రాష్ట్రంలో నిమిషానికి ముగ్గురు కరోనా వైరస్ కు గురి అవుతున్నారంటే పరిస్థితి ఏలా వుందో అర్థం చేసుకోవచ్చు . (2/30) . pic.twitter.com/XB4RwyDY8W
— 𝙈𝙖𝙜𝙖𝙣𝙩𝙞 𝙍𝙖𝙢𝙟𝙞 #𝙏𝘿𝙋𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧🚲 (@Maganti_Ramji) July 23, 2020
30 వరుస ట్వీట్లతో సీఎంపై విరుచుకుపడ్డారు. మాగంటి రామ్జీ తన ట్వీట్లలో కరోనా విషయంలో టీడీపీ మొదటి నుండి మొత్తుకుంటున్నా ప్రభుత్వం పేపర్ ప్రకటనలకే పరిమితమైంది తప్ప కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు శూన్యం అని అన్నారు. రాష్ట్రంలో నిమిషానికి ముగ్గురు కరోనా వైరస్ భారీన పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా బహిరంగ ర్యాలీలు, ప్రారంభోత్సవాలు చేస్తూ కరోనా వ్యాప్తికి కారణమయ్యారని పేర్కొన్నారు.
కరోనాతో చనిపోయిన వారినుంచి కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో , ప్రభుత్వ నిబంధనలతో కరోనా మృతుల కుటుంబ సభ్యులెవరికి మృతదేహాన్ని అప్పగించడం లేదు . (18/30 ). pic.twitter.com/je5A3GuAmv
— 𝙈𝙖𝙜𝙖𝙣𝙩𝙞 𝙍𝙖𝙢𝙟𝙞 #𝙏𝘿𝙋𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧🚲 (@Maganti_Ramji) July 23, 2020
కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని చెప్పిన సీఎం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా...? అంటే అవి కూడా లేవని.... లక్షల్లో టెస్టులు చేసాం అని గొప్పగా చెప్పుకున్నారని... టెస్టులు చేసిన తరువాత ‘ పాజిటివ్ ‘ వచ్చిన వ్యక్తులకి నాణ్యమైన వైద్యం అందుతుందో లేదో చూడాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నాణ్యమైన వైద్యం అందితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు.
కరోనా మృతులను జెసిబిలతో తరలించి , గుంతలు తవ్వి ఏదో అనాధ శవాలను పూడ్చినట్టు పూడ్చటం చూస్తుంటే , ప్రభుత్వం ఎంత బాద్యతరాహిత్యంగా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది . (22/30) . pic.twitter.com/ark7nAu3l7
— 𝙈𝙖𝙜𝙖𝙣𝙩𝙞 𝙍𝙖𝙢𝙟𝙞 #𝙏𝘿𝙋𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧🚲 (@Maganti_Ramji) July 23, 2020
ఏపీలో వైద్యంపై నమ్మకం లేక ప్రజాప్రతినిధులు పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారని.... క్వారంటైన్ కేంద్రాలలో సదుపాయాలు లేవని... కరోనా పేషెంట్స్ కి అందించే ఆహారంలో నాణ్యత లేదని... కరోనా మహమ్మారి గురించి , ప్రజలకు సరైన అవగాహన కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని... కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి భద్రత వుండదని... ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని మీకు ముఖ్యమంత్రి పదవెందుకు...? అని ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోని మీకు , ముఖ్యమంత్రి పదవెందుకు ‘ 6093 ‘ గారు ? #CoronaCrisisInAP #WakeUpJagan #JaganFailedCM #DisastrousGovernment #APinUnsafeHands (30/30) . pic.twitter.com/NunyZHVIpt
— 𝙈𝙖𝙜𝙖𝙣𝙩𝙞 𝙍𝙖𝙢𝙟𝙞 #𝙏𝘿𝙋𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧🚲 (@Maganti_Ramji) July 23, 2020