విధి వైపరీత్యాలు అంటే ఇవే మరి! జరిగే వాటిని ఎవరూ ఆపలేరు.. నిజమే మరి.. ఈ దురదృష్ట సంఘటన వింటే మీకు తప్పక హృదయం ద్రవిస్తుంది. ఓ గర్భిణీ పండంటి పసిబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అనారోగ్యం కారణంగా కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. దాంతో పుట్టబోయే తమ బిడ్డపైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విగత జీవిగా మారిన ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి అంబులెన్సులో ఆ కుటుంబం బయలుదేరింది.

 

కానీ విధి వైపరీత్యం... ఆ అంబులెన్సుని ఓ లారీ ఢీకొట్టడంతో ఆ కుటుంబానికి తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో వారిని మరలా ఆసుపత్రికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన కేరళలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలో, ఆ అంబులెన్సు తిరువనంతపురం నుంచి చవారాకు బయలుదేరుతుండగా ఈ పెను ప్రమాదం జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో చవారాకు బయలుదేరిన అంబులెన్సు మేవార్ బైపాస్ మీదుగా వెళుతోంది.

 

అటువైపుగా... కారికోడ్ నుంచి వస్తున్న లారీ, సిగ్నల్ దాటుతున్న అంబులెన్సును చాలా తీవ్రంగా ఢీకొట్టింది. దాంతో అంబులెన్సులో ప్రయాణిస్తున్న ఆ కుటుంబం యొక్క ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు, హుటాహుటిన గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ స్థానికులలో ఒకరు అంబులెన్సుని పరికించి చూడగా, అందులోని ఓ బాక్సులో వస్త్రంతో చుట్టిన శిశువును గుర్తించారు.

 

మొదట వారు బతికున్న శిశువనే అనుకున్నారు. కానీ శిశువు కదలక పోవడంతో మరణించిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసుల సహాయంతో శిశువు మృతదేహాన్ని బైపాస్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీకి తరలించారు. ఇకపోతే తీవ్రంగా గాయపడిన ఆ ఐదుగురిని, పాలథార సహకార ఆస్పత్రిలో చేర్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితుల వివరాల కొరకు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: