హైదరాబాద్‌.. ఓ అద్భుత నగరం.. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇది అవకాశాల స్వర్గం. ఏనాడో కులీకుతుబ్‌ షా కట్టించిన ప్రేమ నగరం.. ఆయన ఏ ముహూర్తంలో కట్టించాడో కానీ.. నిత్యం కొత్త సొబగులతో అభివృద్ధి దిశగా పయనిస్తూనే ఉంది. 

 

IHG


హైదరాబాద్ లో ట్రాఫిక్ ఓ పెద్ద సమస్య.. దీనికి మెట్రో రాకతో కాస్త ఊరట దక్కినట్టే ఉన్నా.. ఇంకా ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు.. వాటిని తప్పించడానికి ఉన్న అన్ని అవకాశాలు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 

 

IHG


ఇక ఉప్పల్ చౌరస్తాలలో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా ఎక్కువ. హైదరాబాద్ ను వరంగల్ తదితర జిల్లాలను కలిపే హైవే ఇదే మార్గంలో ఉండటం.. అటు వెళ్తే సికింద్రాబాద్.. ఇటు వెళ్తే ఎల్బీనగర్.. మరోవైపు రామంతపూర్.. ఇలా నాలుగు వైపులా రద్దీ మార్గాలే. 

 

IHG


ఇప్పుడు ఈసమస్యను తప్పించేందుకు ఉప్పల్ చౌరస్తాలో ఓ స్కైవే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకు తాజాగా కేటీఆర్ పచ్చజెండా ఊపేశారు. ఇప్పుడు ఆ వివరాలు హెచ్‌ఎండీఏ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఏడాదిలో ఉప్పల్ సర్కిల్ ఇలా సుందరంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తయారవుతుందట. ఇది త్వరగా పూర్తి కావాలని ఆశిద్దాం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: