కరోనాతో ప్రపంచమే తలకిందులవుతోంది. అనేక దేశాలు ఈ కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాయి. ఇక ఇండియా పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. కరోనా కేసులు రోజు రోజుకూ భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. 

 

IHG

 


అయితే.. ఈ కరోనా ప్రభుత్వాల ఆర్థిక వనరులను కూడా దారుణంగా దెబ్బ తీసింది. వ్యాపారాలు కుదేలై ప్రభుత్వాలకు ఆదాయం  కరవైంది. మొన్న లాక్ డౌన్ కాలంలో అయితే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. పరిస్థితులు ఇలా ఉంటే.. కరోనా  తెలంగాణ రాష్ట్రానికి ఓ మేలు చేసిందనే చెప్పాలి. 

 

IHG


కరోనా కారణంగా  కొన్ని మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయా మందులను తయారు చేసే ఫార్మా కంపెనీలకు మంచి అవకాశాలు  కల్పించింది. అయితే ఇలాంటి ఫార్మా కంపెనీలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. సాఫ్ట్ వేర్ తర్వాత తెలంగాణలో ఫార్మా రంగం కూడా చాలా బలంగా ఉంది. 

 

IHG


ఇప్పుడు ఆ కంపెనీలు కరోనా మందుల తయారీలో ఫుల్లు బిజీగా ఉన్నాయి. అంతే కాదు.. ఈ కంపెనీల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అంటే ఆ రకంగా తెలంగాణలోకి  పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఒక విధంగా ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదే కదా. సంక్షోభంలో అవకాశాలు అంటే ఇలాంటివే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: