జగన్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఏపీ ప్రజలకు అందించారు. ఏపీ చరిత్రలో ఏ సీఎం చేయని విధంగా ఏడాది సమయంలోనే తాను ఇచ్చిన హామీలని దాదాపు 90 శాతం వరకు అమలు చేశారు. అసలు జగన్ అమలు చేసిన ప్రతి పథకం సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. మొదట్లో పథకాల విషయంలో విమర్శలు వచ్చాయిగానీ, ఇప్పుడు అలాంటివేమీ రావడం లేదు. ప్రతి పథకం ప్రజలకు ఉపయోగపడుతుంది. దీంతో జగన్ ప్రభుత్వానికి మరింత మద్ధతు పెరిగింది.

 

అయితే జగన్ కొన్ని నెలల కిందట ప్రారంభించిన ఓ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న జగన్‌పై పేద ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ విధంగా జగన్‌కు ప్రశంసలు దక్కేలా చేసిన కార్యక్రమం ఏదో కాదు...ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి తీసుకొచ్చిన ‘నాడు-నేడు’. ప్రతి విద్యార్ధి కార్పొరేట్ పాఠశాలల వైపు ఆకర్షిలవుతున్న నేపథ్యంలో జగన్ నాడు-నేడు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.

 

కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తున్నారు.  ప్రతి నియోజకవర్గంలోని పాఠశాలల బాధ్యతలని స్థానిక ఎమ్మెల్యేలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అయితే గ్రామాల్లో స్కూల్స్ రూపురేఖలు మారుతుండటంతో పేద విద్యార్ధుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి వసతులు సమకూరుతాయని సంబరపడుతున్నారు.

 

అయితే జగన్ ఇప్పటికే అమ్మఒడి ఇచ్చి పేద తల్లిదండ్రులని ఆదుకున్నారు. అలాగే కార్పొరేట్ స్కూళ్ళకు ఏ మాత్రం తీసిపోకుండా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని చూస్తున్నారు. ఇక దీనికి ప్రతిపక్ష టీడీపీ అడ్డుపడుతుండటంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇంగ్లీష్ మీడియం కావాలని 90 శాతం ప్రజలు కోరుకుంటున్నారని ప్రభుత్వ సర్వేలో తేలింది. దీంతో ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేసే దిశగా జగన్ ముందుకెళుతున్నారు. ఇక ఈ విధంగా ప్రభుత్వ స్కూళ్ళ అభివృద్ధి కోసం జగన్ కష్టపడుతుండటంతో పేద ప్రజలపై ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మొత్తానికైతే నాడు-నేడు కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: