మనం రోడ్డుపై నడుచుకుంటూ వెళితే మనకు ఎక్కడైనా పాము కనిపించింది అనుకోండి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఆ పాము మన వైపే వస్తుంది అంటే... ఇక ఆగడమా  అక్కడినుంచి పరుగో పరుగు... అయితే కొన్ని కొన్ని పాములు ఏమి చేయవని తెలిసినప్పటికీ కూడా పామును చూస్తే చాలు హడలి పోతుంటారు  జనాలు. ఎక్కడైనా పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ ఏకంగా యువకుడు ప్యాంటు లోకి  పాము దూరింది. దీంతో ఆ యువకుడి గుండె కాస్త జారిపోయింది అని చెప్పాలి. మరి ప్యాంట్ లోకి  పాము దూరితే గుండె జారి పోకుండా ఉంటుందా  చెప్పండి. దీంతో  కనీసం అటూఇటూ కదలకుండా రాత్రంతా అలాగే నిలబడి ఉన్నాడు ఆ యువకుడు. 

 

 చివరికి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జమాల్ పూర్ గ్రామంలో విద్యుత్ పనుల కోసం వచ్చిన ఎనిమిది మంది కార్మికులు... స్థానికంగా  ఉన్న అంగన్వాడీ కేంద్రంలో రాత్రి సమయంలో సేద తీరుతున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో... లవ్ రాజ్ కుమార్ అనే యువకుడు ప్యాంట్ లో ఏదో పాకుతున్నట్టు గా అనిపించింది... దీంతో ఏంటి అని నెమ్మదిగా ప్యాంటు విప్పి చూశాడు. దీంతో షాక్.. అతని పాంట్ లో పాము ఉంది. ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన పక్కనున్న వాళ్ళని లేపాడు ఆ యువకుడు. 

 


 దీంతో వారు కూడా ప్యాంట్ లో  పాము ఉండటం చూసి భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన యువకులు పాములు పట్టుకుని వ్యక్తిని తీసుకొచ్చేందుకు ఊర్లోకి వెళ్లారు. ఇక అది తెల్లవారుజామున కావడంతో పాములు పట్టుకునే  వ్యక్తి ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి మూడు గంటల సమయం పట్టింది. ఇక ఏ మాత్రం కదిలినా పాము కాటు వేసే అవకాశం ఉండడంతో ఆ యువకుడు కనీసం అటూఇటూ కదలకుండా అలాగే మూడు గంటలపాటు నిలబడ్డాడు. ఇక చివరికి పాముల పట్టుకునే వ్యక్తి వచ్చిన తర్వాత ఆ పాము ని పట్టుకున్నాడు.. దీంతో ఆ యువకుడు  ఊపిరి పీల్చుకున్నాడు. ఏదేమైనా ఇలా పాము ప్యాంటు లో కి దూరడం  అంటే ఆ భయానికే  ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సుమీ.

మరింత సమాచారం తెలుసుకోండి: