సింహాచలం, సింహాద్రి అప్పన్న కొలువుదీరిన ఆలయం.. విశాఖ తీరం సమీపంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి  వెలసిన ఆలయం.  తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఉత్తరాంధ్ర వాసులు సింహాద్రి అప్పన్నగా  ప్రేమగా పిలుచుకుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి.

 

IHG


ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ సింహాచలం.. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయంగా చెబుతారు. ఇలాంటి ఆలయానికి ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. కేంద్రం పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ప్రసాద్ పథకం కోసం ఈ ఆలయం కూడా ఎంపికైంది. 

 

IHG


ప్రసాద్ పథకం కోసం కేవలం ఐదు ఆలయాలనే ఎంపిక చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లోని సింహాచలం ఉండటం నిజంగా ఏపీ వాసులు గర్వపడే విషయం. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ ట్వీట్ ద్వారా ప్రకటించింది.

 

ఈ ట్వీట్ ను మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతి కోట్ చేస్తూ... ఆనందం ప్రకటించారు. అందరం కలసి సింహాచలం దేవాలయాన్ని మరింతగా అభివృద్ధి చేద్దామంటూ పిలుపు ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: