అయితే కరోనా వ్యాప్తిని ముందుగానే ఊహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఢిల్లీ శరవేగంగా ఓ పెద్ద కోవిడ్ ఆసుపత్రిని కూడా నిర్మించారు. అయితే రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు.
కరోనా కారణంగా కొంత కాలంగా దేశమంతటా హోటళ్ల వ్యాపారం పూర్తిగా కుదేలైన సంగతి తెలిసిందే. నెలల తరబడి ఒక్క రూమ్ కూడా బుక్ కాని హోటళ్లు ఎన్నో. అందుకే ఇప్పుడు ఢిల్లీ సీఎం ఖాళీగా ఉన్న హోటళ్లను కోవిడ్ చికిత్స కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు.
కోవిడ్ రోగులకు మరింత మెరుగైన చికిత్స, సదుపాయాలు అందించేందుకు ఖాళీగా ఉన్న హోటల్ రూములను వాడుకోవాలని ఢిల్లీ సీఎం నిర్ణయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడం అభినందనీయమే. ఈ మంచి ఆలోచనను మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయేమో చూడాలి.
కరోనా వ్యాధి చికిత్స అన్నది ఇప్పుడు ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా మారింది. ఆ తర్వాతే ఇంకా ఏదైనా సరే. అందుకే అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు కలుగుతోంది. అలాంటి సమయంలో ఇలాంటి మంచి నిర్ణయాలు సమస్యలను తేలిగ్గా పరిష్కారం చేస్తాయి.