సామాజిక మాధ్యమాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే విడదల రజిని వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టే పథకాలను చాలా చక్కగా తెలుపుతూ ఉంటారు. ఒక్క ఫేసుబుక్ ఖాతాలోనే ఆమెకు ఆరు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సామాజిక మాధ్యమాలను చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్న విడుదల రజనీ కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆమె ప్రతి రోజు కరోనా కి సంబంధించిన ఒక పోస్ట్ పెడతారు. అయితే తాజాగా ఆమె... 'డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మేట్ ఎంత అవసరమో.. బయటకు వచ్చేటప్పుడు మాస్కు అంతే అవసరం. లేకుంటే మన ప్రాణానికే ప్రమాదకరం', అంటూ ఒక పోస్ట్ పెట్టి మాస్క్ ధరించడం ఎంత అవసరమో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.
ఐతే ఫేసుబుక్ లోని కామెంట్ విభాగంలో "అమ్మ, విడదల రజిని.. మీరు మా చిలకలూరిపేటకు ఎమ్మెల్యేగా రావడం మేము చేసుకున్న అదృష్టం. ప్రజలను సంరక్షించే మీ స్వభావం, పరిపాలన మాకు ఎంతగానో నచ్చింది", అని చిలకలూరిపేట ప్రజలు విడదల రజిని ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని విడదల రజిని ఫేసుబుక్ వేదికగా తెలిపారు. "రాయలసీమ ప్రజల చిరకాల అకాంక్ష కడపస్టీల్ ప్లాంట్ శరవేగం. మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు. పెదనందలూరు గ్రామాల్లో ఎకరాల్లో 3591.65 ప్లాంటు నిర్మాణం. రూ.50కోట్లతో నాలుగులైన్ల రహదారికి పరిపాలనా అనుమతులు. రూ.76లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఉత్తర్వులు" అని ఆమె తన ఫేసుబుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.