సదరు మహిళకు నాలుగు నెలల చిన్నారి ఉంది, ఇక మద్యం సేవించిన అనంతరం... సదరు మహిళ పసికందు తోనే పడుకుంది... పక్కనే తన నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. ఇక మద్యం మత్తులోనే.. పసికందుకు దగ్గరగా పడుకోవడం... డైపర్ మార్చడం.. పాలు పట్టించడం.. ఇవన్నీ చేసింది ఆ తల్లి. జాగ్రత్తగా చూసుకొని పడుకుంది. కానీ తెల్లారి చూసేసరికి ఆ పసికందులో ఉలుకూ పలుకూ లేదు. పెదవులు మొత్తం నీలం రంగులోకి మారిపోయాయి. దీంతో ఎంతగానో టెన్షన్ పడిపోయిన ఆ తల్లి వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న వైద్యులు పసికందును పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. అయితే బీరువాసన కారణంగానే పసికందు మరణించిందని వైద్యులు తెలిపారు. బీరు కారణంగా ఆ చిన్నారికి ఊపిరి ఆడక మృతి చెందినట్లు నిర్ధారణ కావడంతో ఏకంగా తల్లి పైన కేసు నమోదు చేశారు.తల్లి నిర్లక్ష్యం కారణంగానే ప్రసికందు మరణించింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం తెలిపింది.
కాగా అమెరికాలో ఇలా బీరు మద్యం సేవించి తమ పిల్లల వద్ద పడుకోవడం కారణంగా ఎంతోమంది చిన్నారులు కళ్లు తెరవకముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయట.
Powered by Froala Editor