ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  జగన్ సర్కార్ తలపెట్టిన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సహా మరో వైపు నిమ్మగడ్డ వ్యవహారం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే నిమ్మగడ్డ వ్యవహారం కాస్త సుఖాంతమైంది. మొన్నటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన నిమ్మగడ్డ  వ్యవహారం... గవర్నర్ ఆదేశం తో  సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా మరోసారి నిమ్మగడ్డ ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చే వారంలో ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.



అయితే రమేష్ కుమార్ ను మళ్లీ ఈసీగా  నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవటం పై స్పందించిన... టిడిపి పార్టీ  గవర్నర్ చట్టబద్దంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని పర్యవేక్షించారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. గవర్నర్  ఎంతో బాధ్యతగా వ్యవహరించారని... ఆయన  నిమ్మగడ్డ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అంటూ తెలుగుదేశం పార్టీ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఈ రోజు సాయంత్రం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జగన్ సర్కార్ తలపెట్టిన వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సహా సీఆర్డీఏ  రద్దు కు సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపింది, దీంతో గవర్నర్ ఆమోదంపై టిడిపి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. గవర్నర్ నిరంకుశంగా వ్యవహరించారని.. మూడు రాజధానులు బిల్లు కు గవర్నర్ ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధం అంటూ విమర్శలు  చేయడం మొదలు పెట్టింది టిడిపి.



ప్రభుత్వం ఎలా  చెప్తే గవర్నర్ అలా ముందుకు వెళ్తారా... కనీసం న్యాయవాదుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటారా  అంటూ టిడిపి ఆరోపణలు చేస్తోంది. ఇలా పొద్దున నిమ్మగడ్డ వ్యవహారంలో గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించారు అన్న టిడిపి సాయంత్రం వికేంద్రీకరణ బిల్లు ఆమోదించే సరికి గవర్నర్ నిరంకుశంగా వ్యవహరిస్తోన్నారు  అంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. అయితే తెలుగుదేశం పార్టీ విమర్శించడంలో తప్పులేదు కానీ ఈ వ్యవహారంలో కి రాష్ట్ర గవర్నర్ ను  లాగడం మాత్రం ముమ్మాటికీ  తప్పే అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా నెగటివ్ ఇంప్రెషన్ తో  టీడీపీకే  రాబోయే రోజుల్లో నష్టం ఉంటుందని అంటున్నారు అంటున్నారు విశ్లేషకులు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: