అయితే 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా, మళ్ళీ టీడీపీని వీడటానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలోనే జగన్‌కు మద్ధతు తెలిపేందుకు రెడీ అవుతున్నారు. కాకపోతే ఈయన్ని వైసీపీ వైపు రాకుండా అడ్డుకునేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎప్పటి నుంచో గంటా వైసీపీలోకి రావాలనుకున్నా అవంతినే అడ్డుపడ్డారని ప్రచారం జరిగింది.
కానీ చివరికి గంటా వైసీపీలో తనకు సన్నిహితంగా మరో మంత్రి ద్వారా లాబీయింగ్ చేసి, జగన్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు తెలిసింది. ఆగష్టు 16నే గంటా వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే గంటాని వైసీపీలోకి రాకుండా అడ్డుకునేందుకు మంత్రి అవంతి ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా కూడా ఆయన గంటాపై తీవ్ర విమర్శలు చేశారు. గంటా తనపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికే వైసీపీ వైపు మెగ్గు చూపుతున్నారని, అధికారం ఎక్కడ ఉంటే, గంటా అక్కడ ఉంటారన్నారు. అధికారం లేకపోతే గంటా ఉండలేరని, గంటా వైసీపీలోకి వచ్చేందుకు లీక్స్ ఇస్తున్నారని చెబుతున్నారు. మంత్రి అవంతి మాటలు చూస్తుంటే గంటా వైసీపీలోకి రావడం ఖాయమైందని తెలుస్తోంది. ఆయన విజయసాయిరెడ్డితో కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా...అవి పెద్దగా వర్కౌట్ కాలేదని అర్ధమవుతుంది. మొత్తానికైతే అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుని వైసీపీలోకి రాకుండా చెక్ పెట్టలేకపోయారనే చెప్పొచ్చు. మరి గంటా వైసీపీలోకి వచ్చాక అవంతి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.