దక్షిణ ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీరాలకు కి దగ్గర్లో వాయువ్య బంగాళాఖాతంలో ఒక తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని... ఈ అల్పపీడనం నిన్న ఏర్పడిందని... ఉపరితల ఆవర్తనం ఏడు కిలోమీటర్ల మేరకు ఏర్పడిందని.. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంపు తిరిగి ఉందని... దీని కారణంగా ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ జిల్లాలతోపాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా ఈ రోజున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర జిల్లాలలో ఈ రోజున భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని... రేపు మాత్రం కేవలం భారీ వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ కేంద్ర శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే ముంబాయి నగరంలో భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా కురుస్తున్నాయన్న సంగతి తెలిసిందే. భారతదేశంలో మొట్టమొదటిగా ఒరిస్సా రాష్ట్రం భారీ వర్షాలకు అల్లాడి పోయింది. ఆ తర్వాత ఇప్పుడు ముంబై నగరం అతి భారీ వర్షాలతో, వరదలతో కొట్టుమిట్టాడుతోంది.