ప్రతి వంటకాల్లో టమాటను వాటడం కామన్. కానీ టమాటను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి పాడైపోతాయి. మెత్తగా ఉండాల్సిన టమాటలు స్ట్రాంగ్ అయి ఉబ్బుతాయి. తెలియని విషయం ఏంటంటే ఫ్రిజ్ లో టమాటను పెట్టడం వల్ల తన రుచిని కోల్పోతుంది.
కొందరు చాకెట్లను బాగా కూల్ చేసుకుని తింటుంటారు. నిజానికి వీటిని కూల్ చేసి తింటే టేస్ట్ ఉండదు. కలర్ కూడా మారిపోతుంది. క్రిస్టల్ గా తయారవుతుంది. బాగా చల్లారిన చాక్లెట్ ను తిన్నా అంత టేస్ట్ ఉండదు. చాక్లెట్ లో ముఖ్యంగా కోకో బటర్ చాకెట్లు అస్సలు ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఈ చాక్లెట్ తమ చుట్టు ఉన్న వాసనను పీల్చుకుంటాయి. దీంతో ఆరోగ్యానికి ప్రమాదమే. కేక్స్ ని అమ్మే షాపుల వాళ్లు ఫ్రిజ్ లో పెడుతుంటారు. కానీ అలా చేయకుండా గాలి చేరని కంటైనర్ లో లేదా చిన్న కేక్ టిన్ పెడితే రుచి బాగుంటుంది.
బంగాళ దుంపలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అవి చెడిపోతాయి. బంగాళ దుంపలను ఫ్రిజ్ లో పెట్టినప్పుడు అందులో ఉంటే పిండిపదార్థాలు షుగర్ గా మారుతాయి. అలా ఫ్రిజ్ లో పెట్టిన బంగాళ దుంపలను వండితే ఆ షుగర్ కాస్త అమైనో యాసిడ్ తో కలిసి ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఆ రసాయం మన శరీరంలోకి ప్రవేశిస్తే నరాలు, కండరాలు బలహీనమవుతాయి. న్యాచురల్ హనీని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది తన సహజ గుణాన్ని కోల్పోయి చక్కెరగా మారుతుంది.