ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో చైనాలో మరో వైరస్ విజృంభిస్తోంది. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా చైనాలోనే వైరస్ విజృంభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనానే కొత్త వైరస్ లను సృష్టిస్తోందా...? అని పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ చెబుతున్న సమాచారం ప్రకారం  తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌ల్లో గత నెలలో 37 మంది థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ బున్యా వైరస్ నిర్ధారణ అయింది. తాజాగా తర్వాత అన్హుయి ప్రావిన్స్‌లో 23 మందికి వైరస్ సోకింది. మొత్తం 60 మంది వైరస్ సోకగా 7 మంది మృతి చెందారు. అయితే ఈ వైరస్ కొత్తది కాదు. పదేళ్ల క్రితమే ఈ వైరస్ ను అక్కడి శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
 
నల్లి (టిక్) వంటి కీటకాల ద్వారా జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతోందని తెలుస్తోంది. జిన్జియాంగ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యుడు షెంగ్ జిఫాంగ్ వ్యాపిస్తోందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నంత కాలం అంటువ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. గత పదేళ్లలో తూర్పు ఆసియాలో తీవ్రమైన జ్వరం, థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.         
 
అమెరికా వైరాలజిస్ట్‌లు ఈ వైరస్ సోకితే అధిక జ్వరం, ల్యూకోపెనియాతో సహా క్లినికల్ సంకేతాలు ఉంటాయని చెప్పారు. మనుషులతో పాటు మేకలు, పశువులు, గుర్రాలు, పందులు సహా వ్యవసాయ జంతువులలో ఈ వైరస్ ను కనుగొన్నారు. చైనా నుంచే వైరస్ లు వ్యాప్తి చెందుతూ ఉండటం అనుమానాలకు తావిస్తోంది. కరోనా వైరస్ లా ఈ వైరస్ కూడా శరవేగంగా వ్యాప్తి చెందితే మాత్రం ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

మరింత సమాచారం తెలుసుకోండి: