వివరాలు తెలుసుకుంటే... బుధవారం నాడు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి తుక్కుగూడలో ఓ స్థలంలోని షట్టర్ ఖాళీ చేయాలని స్థలం ఓనర్ పాతబస్తీ చత్రినాకకు చెందిన వ్యక్తి(50)తో తగాదా పెట్టుకున్నాడు. అలాగే పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి తన స్థలంలో షట్టర్ పెట్టి తీసేయడం లేదని ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసారు. దీంతో స్థల యజమాని ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితుడు తన ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగోలేకపోవడంతో... సమీప ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. కరోనా లక్షణాలు కూడా కనిపించడంతో ఆస్పత్రి వైద్యులు అతనికి కొవిడ్19 టెస్ట్ కూడా చేసారు.
అయితే నిన్న అతని శ్వాబ్ సాంపిల్స్ కి ఫలితాలు రాగా... కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గురువారం ఉదయం నిందితుడిని రిమాండ్ కి తరలించే క్రమంలో ఈ విషయం పోలీసు అధికారులకు తెలిసింది. అప్పటివరకు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా నిందితుడికి దగ్గరగా మెలిగిన పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలియగానే నిందితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అలాగే పోలీస్ స్టేషన్ నుండి పరుగు పరుగున బయటికి వచ్చేశారు. పోలీస్ స్టేషన్ లో అణువణువున క్రిమిసంహారక మందును పిచికారి చల్లించి గురువారం రోజంతా బయటనే కూర్చుని విధులు నిర్వర్తించారు పోలీసు అధికారులు.