ఈ ఏడాది ఎన్నో ప్రమాదాల్ని కళ్ళారా చూస్తున్నాం... ఒక పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే మరో పక్క ఎన్నో ప్రమాదాలు తలెత్తుతున్నాయి. నిజంగా ఈ ప్రమాదాల కారణంగా ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌లో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దీనిలో 70 మందికి పైగా చనిపోయారు. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి  నాలుగు వేల మందికి పైగా గాయపడినట్లు చెప్పారు. అసలు ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి...? ఈ విషయానికి వస్తే  పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు గోదాముల్లో నిల్వ చేస్తారు . ఇదే ఆ ప్రమాదం జరగడానికి కారణం అయినట్టు అధికారులు వెల్లడించారు.


అమ్మోనియం నైట్రేట్‌ వల్లనే ఈ భారీ ప్రమాదానికి ప్రధాన కారణం అని భావిస్తున్నారు అధికారులు. ఈ విషయాన్ని పరిశీలిస్తే మరి  విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా...?  అని అనేక  సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయం గురించి కాస్త స్పష్టత ఇచ్చేసారు  విశాఖ పోర్టు అధికారులు. ఇక్కడ ఇలాంటివి సమభావించే అవకాశమే లేదని నిపుణులు, అధికారులు  కూడా స్పష్టం చేసేసారు. మరి ఎందుకు విశాఖ పోర్టు లో సంభవించవు అనే విషయానికి వస్తే...


ఇక పై విశాఖ పోర్టు లో అమ్మోనియం నిల్వలు ఉండవని అధికారులు చెప్పారు. అక్కడ కేవలం హ్యాండ్లింగ్‌ మాత్రమే  జరుగుతుందని.... అమ్మోనియం నిల్వలు ఉండవని  విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలియ జేశారు.  గత  20 సంవత్సరాలుగా ఇటువంటి సమస్యలు ఏవి ఇక్కడ తలెత్తలేదని అధికారులు స్పష్టం చేసారు. నిర్దిష్ట సమయం లో పకడ్బందీగా అన్‌లోడ్‌  చేస్తామని , విశాఖ పోర్టు లో పేలుళ్లు జరిగే పరిస్థితుల ఎప్పుడు లేవు, రావు అని  నిపుణులు, అధికారులు కూడా చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: