భార్య భర్త అడుగుజాడలలో నడవాలి. పతియే ప్రత్యక్షదైవం. ఇపుడు ఇలాంటి మాటలకు కాలం చెల్లిందనే చెప్పాలి. ఇపుడు మనం ఆయా కొటేషన్స్ ను తిరిగి రివర్స్ రాసుకొనే పరిస్థితి వున్నది. అవును ఆడది అబల కాదు, సబల అని నిరూపించాలని అనుకుందో ఏమో మరి ఓ ధీర వనిత. ఏకంగా తన భర్తనే ఇష్టమొచ్చినట్లు కొట్టి స్థానికులను నివ్వెరపోయేలా చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళితే..

హ‌ర్ష‌ద్ అనే యువకునికి మ‌ధుమేహం ఉండటం వలన ఆలూ క‌ర్రీ తిన‌కూడ‌దు. కానీ ఆ రోజు అత‌ని భార్య చ‌పాతీల్లోకి ఆలూ కూర్మా చేసింది. దానికి హర్షద్ 'ఇది నేను తిన‌కూడ‌దు అని నీకు తెలుసు క‌దా. ఎందుకు చేశావు ఈ కర్రీ? నువ్వు కావాల‌నే చేశావు క‌దా' అని అన్నాడంట‌. అంతే.. అన్నాడట పాపం. చిర్రెత్తిన అతని భార్య బ‌య‌ట‌కు వెళ్లి బ‌ట్ట‌లు ఉతికే క‌ర్ర‌ను తీసుకొచ్చి భ‌ర్త‌పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడి తెగ వాయించేసింది.

ఆ దెబ్బ‌లకి అదిరిపోయి, బెదిరిపోయి గట్టిగా అరవడంతో స్థానికులు పరుగు పరుగున వచ్చి చూడగా, అక్కడి తంతు పూర్తిగా రివర్స్ లో ఉండటం గమనించిన స్థానికులు ముక్కున వేలేసుకొని స్టన్ అయిపోయి చూస్తూ ఉండిపోయారట. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని కుడి భుజం పూర్తిగా విరిగి అతను చతికల పడిపోయాడట. ఒక్కసారిగా ఆ ఘటననుండి తేరుకున్న అనంతరం స్థానికులు అత‌న్ని హాస్పిట‌ల్‌కు తరలించారట.

విషయం తెలుసుకున్న పోలీసులు హ‌ర్ష‌ద్ ని ప్రశ్నించగా... జరిగిన తంతుని, వారి ఇంట్లో జరిగే రోజువారీ ముచ్చట్లను పోలీసుల‌కు వివరించాడట. జ‌రిగిందంతా విన్న పోలీసులు FIR న‌మోదు చేశారు. ఇక ఆ అమాయక భర్తకు తన గయ్యాళి భార్యనుండి విముక్తి ప్రసాదిస్తామని పోలీసులు మాట ఇవ్వడంతో పాటు ఆమెను కటకటాల్లోకి నెట్టారట. ఇంతకీ ఈ ఘ‌ట‌న ఎక్కడ జరిగిందో తెలుసా... అహ్మదాబాద్‌లోని వాస్నాలో చోటుచేసుకున్న‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: