భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 60,000కు అటూఇటుగా కేసులు నమోదవుతూ ఉండగా రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం భారత్ లో కరోనా కేసుల సంఖ్య 23,96,937కు చేరగా మరణాల సంఖ్య 47,033కు చేరింది. కొత్తగా నమోదైన మరణాలతో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరింది.
 
భారత్ లో ప్రస్తుతం 6,53,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. దేశంలో నిన్న ఒక్కరోజే 56,000 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు యువతపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) కరోనా వైరస్ యువతపై శారీరకంగా మరియు మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతోంది.
 
కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని యువతలో సగం మంది ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారని ఐఎల్‌వో అధ్యయనంలో తేలింది. 1829 ఏండ్ల వయస్సున్న 12 వేల మందిపై 112 దేశాలలో సర్వే జరిపి ఐఎల్‌వో ఈ విషయాలను వెల్లడించింది. యువతపై కొవిడ్‌ ప్రభావం పేరుతో ఈ సంస్థ నివేదికను విడుదల చేసింది. యువతలో దాదాపు 38 శాతం మంది భవిష్యత్తు ప్రణాళికలపై కరోనా వైరస్ ప్రభావం చూపిందని తేలింది.
 
విద్యాలయాలు మూతబడటంతో చాలామంది విద్యార్థులు కెరీర్ గురించి భయపడుతున్నారని అధ్యయనంలో తేలింది. ఆయా దేశాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు యువతలో ఆందోళనను తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. చర్యలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో నష్టం కలుగ్తుందని ప్రపంచ కార్మిక సంస్థ చెబుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల యువతలో సైతం మరణాలు నమోదవుతున్నాయని చెబుతున్నాయి. కరోనా గురించి అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ను జయించటం సాధ్యమే.



మరింత సమాచారం తెలుసుకోండి: