మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి అయితే రఘురామకృష్ణంరాజు విమర్శల పర్వం మరింత ఎక్కువగా అయింది. ప్రతిపక్ష టిడిపి పార్టీ కంటే వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎక్కువగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు. అమరావతి రైతులందరికీ సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది అంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.




 ఇటీవలే అమరావతి లో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎంతో హర్షణీయం గా ఉన్నాయి అంటూ ఆయన తెలిపారు. అయితే జగన్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది అంటూ వ్యాఖ్యానించిన  రఘురామకృష్ణంరాజు... చీటికీ  మాటికీ  హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం వల్ల ప్రజాధనం వృధా అవ్వడం తప్ప ప్రయోజనం ఉండదు అంటూ వ్యాఖ్యానించారు, జగన్ సర్కార్ పెద్దపెద్ద లాయర్లను పెట్టుకొని వారికి కోట్ల రూపాయలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారని ఆరోపించారు రఘురామకృష్ణంరాజు.



 రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు చట్టాలపై బుధవారం జరిగే విచారణలో అమరావతి రైతులు అందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది అంటూ రామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. పార్టీ కి చెడ్డపేరు రావద్దని తాను ఈ సలహా ఇస్తున్నానని  కానీ తన సలహా లు నచ్చని వారు ఇప్పటికే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారూ అంటూ వ్యాఖ్యానించారు, తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారి గురించి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. విమర్శలు గుప్పించారు రఘురామకృష్ణంరాజు. ఫోన్ టాపింగ్ అంశం పార్లమెంటు లో లేవనెత్తుతా అంటూ హెచ్చరించారు. కాగా ప్రస్తుతం రఘు రామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: