ఈరోజు వినాయక చవితి సందర్భంగా విడదల రజిని తన ఫేసుబుక్ ఖాతా వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'సర్వ విజ్ఞహరం దేవం, సర్వ విజ్ఞ వివర్జితమ్, సర్వసిద్ధి ప్రధాతరం, వందేహం గణ నాయకమ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు,' అని విడదల రజిని తెలిపారు. అలాగే ఒక ఫోటో ని పోస్ట్ చేసిన విడదల రజిని... 'మట్టి గణపతిని మాత్రమే పూజిద్దాం. మన సాంప్రదాయాన్ని రక్షించుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం', అని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
స్వచ్ఛభారత్ సర్వే లో అత్యంత పరిశుభ్రంగా ఉన్న 64 నగరాలలో ఆరు నగరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే ఉన్నాయని.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ప్రతి ఒక్క ప్రాంతం పరిశుభ్రం గా తయారవుతుందని విడదల రజిని ఫేసుబుక్ ఖాతా ద్వారా వెల్లడించారు. జగనన్న ప్రభుత్వంలో వెల్లివిరుస్తున్న విద్యా విప్లవం అనే ఒక వీడియో ని కూడా ఫేసుబుక్ ఖాతాలో తాజాగా అప్లోడ్ చేశారు. చెప్పారంటే చేస్తారంతే అనే ఈ పాట ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు.