పూర్వం గజరూపము కల్గిన గజాసురుడు అనే రాక్షసేశ్వరుడు శివుని కోసం తపస్సుచేయటంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో గజాసురుడు స్వామీ నీవు ఎల్లప్పుడు తన ఉదరంలోనే ఉండమని కోరాడు. భక్తవత్సలుడైన శివుడు ఆ రాక్షసుడి కోరికను మన్నించారు. ఇలా శివుడు కనిపించకుండా పోవటం... గజాసురుడు ఉదరం ఉబ్బిపోవటంతో... పార్వతీదేవి విష్ణువుని ప్రార్ధించగా...జగన్నాటక సూత్రదారి విష్ణుమూర్తి గజాసురుడి ఇంటి ముందు గంగిరెద్దుల ఆటఆడించాడు. దీంతో పులకించిన ఆ గజాసురుడు ఏం కావాలో కోరుకోమని అడగ్గా... శివున్నివ్వమని అడిగారు. నివ్వెరపోయిన గజాసురుడు చేసేదేం లేక ఇచ్చిన మాట ప్రకారం సరే ననటంతో విష్ణుమూర్తి వెంట తీసుకెళ్లిన ఎత్తుకొమ్ములతో గజాసురుడిని సంహరించాడు. అక్కడి నుంచి నేరుగా శివుడు కైలాసానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తూ, నలుగు పిండితో ఓ బాలుడి బొమ్మని చేసి ప్రాణం పోసి .. కాపరిగా ఉంచి వెళ్లింది. అయితే ఇంతలో శివుడు అక్కడికి రావటం... అతన్ని బాలుడు అడ్డుకోవటంతో ఆగ్రహించిన శివుడు బాలుడి శిరస్సువదించాడు. ఇంతలో పార్వతిదేవి రావటం...తిరిగి బాలుడుని బతికించమని కోరడంతో... గజరూపమున్న గజాసురుడి తలను తీసుకువచ్చి ఆ బాలుడికి ప్రాణం పోశాడు శివుడు అలా... గజాననుడిగా పేరుపెట్టారు. ఇదంతా భాద్రప్రద చతుర్ధశినాడు జరిగింది. వినాయకుడు గణాధిపతి అయ్యింది కూడా ఇదే మాసంలో. అందుకే చతుర్థశినాడు గణపతి ఉత్సవాలు చేసుకుంటారు.
ఇది ఇలా ఉంటే... దేశంలో సమైక్యతను పెంపొందించటానికి బాలగంగాధర్ తిలక్ 1910 లో కులమతాలకతీతంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం... సమిష్టిగా పూజలు చేయటం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలా యువతలో సమైక్యతను పెంచటం కోసం కూడా వినాయక చవితిని ప్రారంభించారనే వాదన కూడా ఉంది. అందుకే కులాలు, మతాలకు అతీతంగా ఈ వేడులకు జరుపుకుంటారు. దీంతో చిన్న తనం నుంచే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయంటున్నారు.