ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చేతిలో సెల్ఫోన్ మాత్రం ఉండాల్సిందే ... సెల్ఫోన్ చేతిలో లేదు అంటే పిచ్చిగా ప్రవర్తించే వాళ్లు  కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం సెల్ఫోన్ ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో... అని నష్టాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే చిన్న పిల్లలు సెల్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఇక సెల్ఫోన్ లేకుండా క్షణమైనా ఉండలేకపోతున్నారు. ఇక కొంతమంది అయితే సెల్ఫోన్ కోసం ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపుతున్నారు.



 తల్లిదండ్రుల పై అలిగి ప్రాణాలు బలి తీసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. సెల్ఫోన్ అడిగితే తల్లి ఇవ్వలేదు అన్న కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఎన్టీపీసీలో  చెందిన రజిత అనే  వివాహిత నివాసముంటుంది. 12 ఏళ్ల క్రితమే రజిత  భర్త చనిపోయాడు.  అయితే అప్పటికే ఒక కూతురు ఉన్న రజిత రవి కిరణ్ అనే వ్యక్తి ని రెండో వివాహం చేసుకుంది. భార్య భర్తలు ఇద్దరితో పాటు కూతురు  సింధుజ కూడా కలిసే ఉంటుంది.



 అయితే ఇటీవలే పదవ తరగతికి ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్ తరగతులను వింటుంది సింధుజ . ఇక సెల్ఫోన్ ఎప్పటికీ తన వద్దే ఉంచుకుంటాను అంటూ తల్లికి చెప్పింది సింధుజ. కానీ సెల్ఫోన్ ఇస్తే పిల్లలు పాడవుతారని.. సెల్ఫోన్ ఇచ్చేందుకు తల్లి మాత్రం నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింధుజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీ  తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లి బోరున విలపించింది. రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: