దేశంలో కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతున్నా అదే సమయంలో రికవరీ రేటు కూడా పెరుగుతోంది. దేశంలో వైరస్ బారిన పడిన వారిలో 75 శాతం మంది ఇప్పటికే కోలుకున్నారు. అయితే వైరస్ నుంచి కోలుకున్న వారికి సైతం మరణం ముప్పు పొంచి అధ్యయనం చెబుతోంది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల చాలామంది భవిష్యత్తులో ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
 
కరోనా లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు వైరస్ నుంచి కోలుకున్న వాళ్లలో తరచూ కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో పురుషుల్లో ఊబకాయం సమస్యతో బాధ పడే వాళ్లలో ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగనిరోధక ప్రతిస్పందనలో సైటోకిన్లు వైరస్ ల పునరుత్పత్తిని ఆపగలవని అయితే కొన్ని సైటోకిన్ చర్యలు ఇతర రోగనిరోధక కణాల ఇన్ఫెక్షన్‌తో పోరాడటంలో విఫలమైతే నష్టాన్ని కలిగిస్తాయని చెప్పారు.
 
శాస్త్రవేత్తలు మధుమేహం బారిన పడిన వారిలో కరోనా నుంచి చనిపోయే ప్రమాదం రెట్టింపు అవుతుందని చెప్పారు. కరోనా రోగులలో డయాబెటిస్ ను నియంత్రించడం సాధ్యం కాకపోతే అధిక స్థాయిలో గ్లూకోజ్‌కు దారితీస్తుందని తెలిపారు. కరోనా వైరస్ కు గ్లోకోజ్ ఇంధనంలా పని చేస్తుందని... అందువల్ల వైరస్ కరోనా రోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. 60 ఏళ్ల పై బడిన వాళ్లే వైరస్ బారిన పడి మృతి చెందడంతో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
బ్యాక్టీరియా, వైరస్‌లు ఇతర సూక్ష్మజీవులు వంటి వ్యాధుల వల్ల ప్రభావితమవుతాయని వైరస్ సోకిన చాలామంది వృద్ధుల్లో తక్కువ లింఫోసైట్లు ఉన్నాయని చెప్పారు. అందువల్ల వృద్ధులు వైరస్ తో పోరాడటం అంత సులభం కాదని... వృద్ధులు వైరస్ బారిన పడితే రోగనిరోధక ప్రతిస్పందన దెబ్బ తినే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వృద్ధులపై వ్యాక్సిన్ అంత సమర్థవంతంగా పని చేయకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: