మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తుల రద్దీ ఏ సమయం లో చూసినా ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కరోనా  వైరస్ పుణ్యమా అని శ్రీవారికి భక్తుల కు మధ్య దూరం రోజురోజు కు పెరిగిపోతోంది. ఇప్పటికే రోజురోజు కు భక్తులు తమ బాధలను చెప్పుకోవడానికి శ్రీ వారి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నప్పటి కీ కరోనా  వైరస్ కారణంగా అది కాస్తా కుదరడం లేదు. అయితే ఇంకొన్ని రోజు ల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం లో ఈ బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిస్తారు అన్నదానిపై అందరి లో ఆసక్తి నెలకొంది.



 మామూలుగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రహ్మోత్సవాల కు ప్రతి ఏడు లక్షల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. అయితే సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. కరోనా  వ్యాధి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం  తీసుకున్నారు.




 శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు మాడవీధు ల్లో నిర్వహించే పరిస్థితి ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి కారణంగా లేదని... అందువల్లే ఎప్పుడూ అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈ ఏడు మాత్రం ఏకాంతం గానే ఆలయంలో నిర్వహిస్తామని వెల్లడించారు వై.వి.సుబ్బారెడ్డి. ఏడు అధికమాసం సందర్భంగా ఈ ఏడు  రెండు సార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి అంటూ తెలిపిన ఆయన... ఒక వేళ కరోనా  ప్రభావం తగ్గిపోయి పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబర్ లో  ఎప్పటిలాగే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: