కరోనా పాజిటివ్ వచ్చిన 40 సంవత్సరాల వ్యక్తి  జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కరోనా పాజిటివ్ రావడంతో  పట్టణ శివారులో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అందులో రెండు రోజులు చికిత్సకి  రూ.53వేల బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. రెండు రోజులకు కి గాను బెడ్‌ చార్జీల కింద రూ.31 వేలు, మందులకు రూ.13 వేలు, ల్యాబ్‌ టెస్టుల కోసం రూ.4 వేలు, డీసీ చార్జీల కింద రూ.5వేల బిల్లు వచ్చింది. దీనితో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇదీ పరిస్థితి.

కరోనా మహమ్మారై ప్రజలందరినీ పట్టి పీడిస్తుంది. మందు లేని ఈ మహమ్మారిని తరిమి కొట్టే ఉపాయమే లేకపోయింది. మరో పక్క చికిత్స చేయించుకోవడానికి వెళ్తున్న వాళ్లకి ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా సోకిన వారికి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రితో పాటు ఉట్నూర్‌ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. మొత్తం జిల్లా కేంద్రంలో నాలుగు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

అలానే ఇటీవల  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ఆసుపత్రిలో సాధారణ బెడ్లతో పాటు ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సదుపాయాల మాటకేం కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనపడుతున్నాయి.కేవలం  రెగ్యులర్‌ బెడ్లకే  రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆక్సిజన్, ఐసీయూ బెడ్లకు రెట్టింపు చార్జీలు వసూలు చేయడంతో ప్రజలకి ఇక్కట్లు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియంత్రణ ఉందో లేదో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం పై డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌వో చెబుతూ ఇలా అన్నారు.... ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి రాలేదు. ఒక వేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు  తీసుకుంటాం అని ఆయన చెప్పారు. ఇక కరోనా సోకిన వారు మామూలు లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌లోనే ఉండి ప్రభుత్వం అందజేసే చికిత్స తీసుకోవాలి. అదే వైరస్‌ తీవ్రత ఉంటే మాత్రం ఆస్పత్రిలో చేరాలి అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: