కరోనా వైరస్ నేపథ్యంలో రైలు సర్వీసులు అన్ని పూర్తిగా ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ క్రమక్రమంగా రైలు సర్వీసులను పునరుద్ధరిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవలే హైదరాబాద్ నగరవాసులు అందరికీ తీపి కబురు చెప్పింది  మోడీ సర్కార్. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీ మేరకు త్వరలో మరిన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో అన్లాక్ 4.0 అమలవుతున్న నేపథ్యంలో... మరికొన్ని  రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలి అనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారాన్ని రైల్వే బోర్డులకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.




 వివిధ జోన్లలో ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్ట్యా కొత్త రైలు సర్వీసులను ప్రారంభించాలని సూచించిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రస్తుతం 22 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తోడు మరో 15 రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ న్యూఢిల్లీ కి ప్రత్యేక రైలు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికుల రద్దీ డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆ రూట్ లో  మరో సర్వీస్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.



అంతే కాకుండా తిరుపతి కి, సికింద్రాబాద్ నుంచి పాట్న కు,  హౌరా కు కూడా  అదనంగా మరో మరో రైలు  సర్వీసు కూడా ప్రారంభించేందుకు నిర్ణయించారు అధికారులు. ఇక కాచిగూడ నుంచి బెంగళూరుకు కూడా మరో సర్వీస్ నడపనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇది రైల్వే ప్రయాణికులందరికీ శుభ వార్త అనే చెప్పాలి. ఎందుకంటే పరిమిత సంఖ్యలోనే ప్రత్యేక రైలు సర్వీసులు ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం అందుబాటులోకి రాబోతోన్న  అదనపు రైలు సర్వీసులతో ప్రయాణికులు అందరికీ మేలు జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: