కొన్ని కొన్ని సార్లు కొంతమంది కోపంలో చేసే పనులు ఏకంగా ప్రాణాలమీదికి తెస్తూ ఉంటాయి. ఇక్కడ  ఎలుక  భయంతో భార్య చేసిన పని భర్త ప్రాణాలు పోయినంత పని చేసింది. భార్య చర్యతో  ఒక్కసారిగా అవాక్కయిన భర్త... ఏం చేయాలో అర్థం కాని షాక్ లో మునిగిపోయాడు. భార్య కోపానికి బలై  భార్య చెప్పిన మాట వినాలి అంటూ బుద్ది  తెచ్చుకున్నాడు భర్త. ఇంతకీ ఏం జరిగింది అని అంటారా. ఇక్కడ భార్య  బెడ్ రూమ్ లోకి ఎలుక  వచ్చింది.. ఆ ఎలుకను చంపేయాలి అంటూ  భర్తకు చెప్పింది భార్య. కానీ భర్త మాత్రం లైట్ తీసుకో అంటూ చెప్పేసాడు. కానీ భార్య కోపం తన ప్రాణాల మీదకు తెస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. భార్య ఊహించని ప్రవర్తనతో షాక్ అయ్యాడు.



 ఈ ఘటన జాంబియా లోని కిట్వే  జరిగింది. కిట్వే లో నివసిస్తున్న అబ్రహం ముసోణ్డా. ముకుఫా  భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య ఎలుక  కారణంగా గొడవ జరిగింది. భార్య ముకుఫా  తన బెడ్ రూమ్ లో ఎలుకను రావటం చూసింది . ఊరికే శబ్దం చేస్తూ ఉండడంతో భార్య  నిద్ర కు ఎంతో ఆటంకం ఏర్పడింది. దీంతో ఎలుకలు చూసి భయపడి పోయిన భార్య ముకుఫా  భర్తను పిలిచింది . ఆ ఎలుకను తన గది నుంచి తరిమి కొట్టడం లేదా చంపేయడం చేయాలి అంటూ కోరింది. ఆ చిన్న ఎలుక చేసే సౌండ్ కారణంగా తన నిద్ర మొత్తం పాడైపోతుంది అంటూ భర్తకు విన్నవించింది.



 కానీ దీనికి మాత్రం భర్త అంగీకరించలేదు. ఎలుక ఏమీ చేయదులే లైట్ తీసుకో అంటూ భార్యతో చెప్పాడు. దీంతో భర్త తీరుపై కోపంతో ఊగిపోయింది భార్య. ఎలుక ఏం చేస్తుందో అన్న భయంతో రాత్రంతా పడుకోకుండా మేలుకొనే ఉంది. కానీ పక్క గదిలో భర్త మాత్రం గుర్రు పెట్టి మరి పడుకొని ఉండటంతో ఆమెకు మరింత చిర్రెత్తి పోయింది. దీంతో వెంటనే భర్త బెడ్ రూం లోకి వెళ్లి... నాకు నిద్ర పట్టకుంటే  నువ్వు నిద్రపోతావా.. అంటూ కోపంతో భర్త అంగాన్ని గట్టిగా కొరికింది భార్య. భార్య చర్యతో ఒక్కసారిగా ఒక్కసారిగా నిద్రలోంచి ప్రాణం పోసినట్లుగా లేచి కూర్చున్నాడు, ఇక అప్పటికి అంగం  చీలిపోయి రక్తం రావడంతో వెంటనే హాస్పిటల్ కు  పరుగులు పెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: