చైనా భారత్ సరిహద్దు లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ చైనాకు వరుసగా షాకులు  ఇస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చైనాలో పూర్తిగా భారత్ ను  నిషేధించేందుకు నిర్ణయించింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత్ లో  కీలక రక్షణ సమాచారం తస్కరణకి గురయ్యే అవకాశం ఉంది అని భావించిన భారత ప్రభుత్వం చైనా కు సంబంధించిన అన్ని యాప్స్  ను  భారత్ లో  నిషేధిస్తూన్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా చైనాకు షాకులు తగులుతున్నాయి.



 అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్ లో  ఎంతో పాపులారిటీ సంపాదించిన చైనా యాప్ లు  నిషేధానికి గురి కావడంతో చైనా కు సంబంధించిన ఎన్నో కంపెనీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి . గతంలో టిక్ టాక్ లో బ్యాన్ అవ్వగా..  ఇటీవలే ఎంతో పాపులారిటీ ఉన్న పబ్ జీ ని  బ్యాన్  చేసిన విషయం తెలిసిందే. పబ్ జీ  ని బ్యాన్ చేయడం పై చైనా మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కాగా పబ్ జీ  కి ప్రత్యామ్నాయంగా భారత యాప్ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న  విషయం తెలిసిందే.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా పబ్ జీ బ్యాన్ పై  చైనా ఒక విచిత్రమైన స్టోరీ చెప్పింది. పబ్ జీ ని బ్యాన్ చేయడం పై  చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. భారతదేశానికి సంబంధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవితలు, భారత యోగ విధానాలు.. దంగల్ వంటి భారత సినిమాలు చైనాలో ఎంతో పాపులారిటీ సంపాదించాయని.. వాటి ద్వారా భారత సంస్కృతి తమ దేశ సంస్కృతి లోకి చొరబడుతున్నట్టు  ఎప్పుడూ భావించలేదు. కానీ పబ్ జీ  విషయంలో భారత్ నిషేధం విధించడం మాత్రం అర్థం కాని విధంగా ఉంది.. పబ్ జీ  లాంటివి  వాటిని నిషేధించడం ద్వారా భారత ప్రభుత్వం ప్రజల అవకాశాలని   కాలరాస్తుంది అంటూ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. దీనిపై స్పందిస్తూ విశ్లేషకులు చైనా బలే స్టోరీ చెప్పింది అంటూ చలోక్తులు విసురుతూన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: