అసలు విషయానికొస్తే.. ఈ ఘటన తమిళ నాడు లో వెలుగు చూసింది.. పూందపల్లిలోని నషరత్‌పేట మేప్పురు ప్రాంతానికి చెందిన శివరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆగస్టు నెలలో చోరీ జరిగింది. ఇంట్లో బంగారం, నగదును ముట్టుకోని దొంగ టీవీ, ల్యాప్‌టాప్ మాత్రమే ఎత్తుకెళ్ళడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చోరీ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి పప్పు అలియాస్ అప్పన్‌రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి తాను దొంగ ను కానని తను పని చేసిన దగ్గర తన గురించి అడగాలని విన్నవించారు.
అయితే, పోలీసులు తమ స్టయిల్లో అడగ్గా అసలు నిజాన్ని బయట పెట్టాడు. ఆ దొంగతనం తానే చేసినట్లు స్వయంగా ఒప్పుకున్నాడు. కంపెనీ లో పనిచేస్తూ గౌరవంగా జీవించేవాడినని, కరోనా పుణ్యమాని ఉద్యోగం పోవడం తో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులకు చెప్పాడు. బ్రతకడం కోసం దిక్కు తోచని పరిస్థితుల్లోనే దొంగగా మారాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు. తొలుత ఓ రోడ్డు పక్కన కొన్నాళ్లుగా పడివున్న బైక్ ను ఎత్తుకెళ్లి అమ్మేశానని వెల్లడించారు.. ఆ తర్వాత ఈ దొంగతనం చేసినట్లు తెలిపారు. తనని వదిలేస్తే ఇంక దొంగతనం చేయనని మొర పెట్టుకున్నారు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి అతన్ని అరెస్ట్ చేసిన రిమాండ్ కు తరలించారు.