ఏపీ రాజధాని అంశంపై కేంద్ర రాష్ట్రాల్లోనే కాకుండా, దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. తెలంగాణ విడిపోయిన తర్వాత మొదలైన రాజధాని రచ్చ ఇప్పటికీ చల్లారలేదు. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలంటూ టిడిపి పట్టుబడుతుండగా, మూడు రాజధానులు అంటూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వాదిస్తోంది. దీనికి తగ్గట్టుగానే చకా అన్ని పనులు చేసుకుంటూ వెళుతోంది. ఈ వ్యవహారంలో మొన్నటి వరకు కేంద్రం స్పష్టమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఈ గందరగోళం మరింతగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏపీ రాజధాని అంశంలో తాము జోక్యం చేసుకోమని, పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమన కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.


 తాజాగా మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు లో తప్పు లేదని, క్లారిటీ గా పేర్కొంది. అలాగే విభజన చట్టంలో ఏపీకి ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రానికి ఓకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని, 2018 లో అప్పటి ప్రభుత్వం హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేసిందని వివరించింది. అసలు హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పడానికి లేదంటూ, కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సహాయం మాత్రమే తాము చేస్తామని కేంద్రం పేర్కొంది.


కేవలం తమ పరిధి వరకు మాత్రమే జోక్యం చేసుకుంటామని, రాజధాని లేదా రాజధాని విషయంలో తాము ఇంతకుమించి చేసేదేమీ లేదంటూ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం స్పష్టంగా పేర్కొంది. విభజన చట్టం, శివరామకృష్ణన్ కమిటీ వంటి వాటినీ ప్రస్తావిస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసి పై వ్యాఖ్యలు చేసింది. రాజధాని అంశం తమకేమీ సంబంధం లేదని, పిటిషనర్ కేవలం అపోహలతో ఉన్నారని, కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్రం ఇంత క్లారిటీగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంతో, వైసీపీ ప్రభుత్వానికి మరింత మద్దతు లభించినట్టయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: