అమెరికా వెళ్లి ఓ మంచి ఉద్యోగం చేస్తూ తమ కూతురు ఎంతో ప్రయోజకురా లు  అవుతుంది అనుకున్నారు ఆ తల్లి దండ్రులు. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. దేశం కాని దేశం లో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రాణాలు వదిలింది. దీనికంతటికీ కారణం సెల్ఫీ. సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఆమె ప్రాణాలను బలితీసుకుంది. ఆ తల్లిదండ్రుల కు తీరని శోకాన్ని నింపింది . రోజు రోజుకు మితి మీరిపోతున్న సెల్ఫీ పిచ్చి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే.




 రోజు రోజుకు సెల్ఫీ తీసుకోవాలనే సరదా... ప్రమాదకారిగా మారిపోతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అమెరికా లో తెలుగు యువతి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు కు చెందిన పోలవరపు లక్ష్మణరావు అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కమల ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా  వెళ్ళింది. ఇక అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం కొలంబియా లో నివాసం ఉంటున్న కమల మంచి ఉద్యోగం చేస్తూ  ఇండియా లో ఉంటున్న తల్లిదండ్రుల బాగోగులు అన్ని తానే చూసుకుంటుంది.




 ఇక ఇటీవలే అమెరికాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో అట్లాంటా   జలపాతం దగ్గర ఆగి అక్కడ సుందరమైన ప్రదేశాన్ని సెల్ఫీ తీసుకోవాలని అనుకుంది కమల. కానీ ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి ప్రాణాలు వదిలింది. ఇక చివరికి సహాయక సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబ సభ్యులకు మరణవార్తను చరవాణి ద్వారా తెలియజేశారు. చదువుకొని మంచి ఉద్యోగం చేసి తమ కూతురు ఎంతో ప్రయోజనాలు అయింది అని అనుకుంటున్న తరుణంలో ఇలాంటి పెను విషాదం జరిగిందేంటి దేవుడా అంటూ విలపించారు తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: