తాడికొండ నియోజకవర్గం నుంచి 2019 లో జరిగిన ఎన్నికలలో మొదటిసారి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి మొదటి నుండి జగనన్నకు విశ్వాసంగా ఉంటూ వస్తున్నారు. జగన్ చెప్పిన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. అయితే శ్రీదేవి గెలిచింది ఫస్ట్ టైం అయినా పాపులారిటీ మాత్రం మామూలుగా లేదు. అయితే ఈ పాపులారిటీ అంతా కూడా నెగిటివ్ విషయాల్లో రావడమే ఒక సమస్యగా మారింది. చుట్టూ వివాదాలు ఓ రేంజ్ లో ముసురుకుంటున్నాయి. గతంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూ సేకరణ కార్యక్రమం తనకు ప్రజలలో ఒక నెగిటివిటీ తెచ్చిందని చెప్పవచ్చు. దాని తర్వాత పేకాట క్లబ్బులు తన అనుచరులు నిర్వహించారని ఆమెపై ఫిర్యాదు చేయడం అప్పట్లో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఎమ్మెల్యే శ్రీదేవి ఈ వివాదానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  


అంతేకాకుండా బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తన నియోజకవర్గంలో మీటింగ్ లు పెడుతున్నారని ఆయనపై విమర్శలు చేశారు. మరో సందర్భంలో ఇసుక వ్యాపారుల పైన నేరుగా సీఎం జగన్ దగ్గరే  ఎమ్మెల్యే పంచాయతీ పెట్టారు మరియు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని మేడికొండూరు మండలంలోని ఓ మసీదు శంకుస్థాపనకు రావడం ఎమ్మెల్యే శ్రీదేవి కి ఏమాత్రం నచ్చకపోవడం,  నా నియోజకవర్గంలో తనకు ఏమి పని అంటూ బహిరంగంగానే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.ఈ ఘటనలు అన్నింటిపై వైసీపీ పార్టీలో పెద్ద రగడ జరిగింది. ఇవన్నీ సద్దుమణిగాయి అనుకుంటున్న సమయంలో వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి కొనసాగుతున్న సొంత పార్టీ నాయకులు నియోజకవర్గంలోని నాయకుల తీరు నచ్చక పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరులైన శృంగార పాటి సందీప్,  చలివేంద్ర సురేష్,  తుమ్మూరు రమణా రెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లి అధికారుల బదిలీ విషయాలను మరియు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం, పేదలకు ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ విషయంలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. అక్రమ మైనింగ్ కూడా భారీ స్థాయిలో ఉందని ఆరోపణలు వచ్చాయి.



 ఈ అంశం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లడంతో, పై విషయాలన్నింటినీ తో షాక్ తిని ఇకనైనా ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవడానికి ఎమ్మెల్యే శ్రీదేవి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరు చెప్పుకొని చెడు పనులు చేస్తున్న తన అనుచరులు సందీప్, రమణారెడ్డి చలివేంద్రం సురేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ ను పార్టీ పెద్దలకు చెప్పారట. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఉన్న పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే శ్రీదేవి కూడా అందరూ ఏం చేస్తున్నారు 2019 ఎన్నికల్లో శ్రీదేవికి ఆర్థిక సహాయం చేశారు కదా ఆ డబ్బులు అడగడానికి వెళ్లిన వారిపై పోలీసులు ఫిర్యాదు చేస్తానని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవి. తనను ఎమ్మెల్యే శ్రీదేవి మోసం చేశారని తనకు మరణమే శరణ్యమని సెల్ఫీ వీడియో తీసి సీఎం జగన్ కనిపించడం సంచలనం రేకెత్తించింది ఈ సెల్ఫీ వీడియో రాజధాని ప్రాంతంలో పాటు అధికార పార్టీలో ను పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ఎదురుదాడికి దిగి, అసలు ఎమ్మెల్యే ఎటువంటి డబ్బులు తీసుకోలేదని తెలియజేశారు. అయినప్పటికీ ఆ అంశంలో జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. ఈ విధంగా వరుసపెట్టి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వివాదాలు ఎప్పటికి వదిలి పోతాయో కాలమే నిర్ణయిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: