
ఈ క్రమంలోనే రేపటి నుంచి ఏపీ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అయితే ఎంసెట్ పరీక్షల కోసం విద్యార్థులందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కాగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్షలు రాయనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దృశ్య.. తగిన జాగ్రత్తలు మధ్య ఈ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం.
కాగా ఈ నెల 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున... మొత్తంగా 14 సెషన్లలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఎంసెట్ పరీక్ష కోసం ఏపీలోని 47 పట్టణాలలో 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే కఠిన నిబంధనల మధ్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఒక్క నిమిషం నిబంధన అధికారులు అమలులోకి తేవడంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో నిరాశతో వెనుదిరుగక తప్పదు అని హెచ్చరిస్తున్నారు అధికారులు. విద్యార్థులు ముఖానికి మాస్కు తో పాటు చేతికి గ్లౌస్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచిస్తున్న అధికారులు.. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది తెలిపారు.