ఇప్పటికే చైనాపై చర్యలకు ఉపక్రమించింది అమెరికా ప్రభుత్వం. చైనా కు సంబంధించిన యాప్ లపై నిషేధం విధిస్తూ ప్రకటన కూడా చేసింది. అయితే అమెరికా చర్యలపై చైనా మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఇటీవల చైనా కు సంబంధించిన రెండు యాప్ లను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం పై స్పందించిన చైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైనా సంస్థలపై చర్యలు తీసుకొని.. చైనా పై అమెరికా ఇండైరెక్ట్ గా బెదిరింపులకు పాల్పడుతుంది అంటూ ఆరోపించింది. చైనా సంస్థలపై అనైతిక చర్యలను ఇప్పటికైనా అమెరికా ఆపేస్తే మంచిది అంటూ సూచించింది. పారదర్శకతతో కార్యకలాపాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
అమెరికా ఇదే తరహా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళితే... దీటుగా అమెరికా కు బదులు ఇచ్చేందుకు చైనా సంసిద్ధంగా ఉంది అంటూ హెచ్చరించింది చైనా వాణిజ్య శాఖ. చైనా కంపెనీ యొక్క ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం చైనా అమెరికాకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది అని అంటున్నారు ఇండియా హెరాల్డ్ విశ్లేషకులు. అయితే చైనా గోరంత విమర్శ చేస్తే.. ట్రంప్ మొదటినుంచి కొండంత వార్నింగ్ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే మరి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.