కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ప్రజలపై ఎక్కువగా పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఈ వైరస్ ప్రభావం దేవుడిపై కూడా పడిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపుగా దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు  మూసివేయబడ్డాయి. దీంతో ప్రజలందరూ మరింత ఆందోళనలో మునిగిపోయారు. కరోనా  వైరస్ సోకి ప్రాణాల మీదికి రావడం ఏమో కానీ తమ కష్టాలను చెప్పుకుందాం అంటే దేవుడి దగ్గరకు వెళ్లే అవకాశం లేదే అంటూ ఆందోళన చెందారు.



 కానీ క్రమక్రమంగా లాక్ డౌన్ సడలింపు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ప్రముఖ ఆలయాలన్నీ తెరుచుకున్న విషయం తెలిసిందే. ఇక దేవుడి దర్శన భాగ్యం కలుగ బోతుంది అని భక్తులందరూ సంతోషపడే లోపె మరోసారి కరోనా  వైరస్ ఆలయాలకు వెళ్లి భక్తులపై అర్చకుల పై పంజా విసిరి ఆలయం మూసివేసే పరిస్థితి తీసుకు వస్తుంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విషయంలో కూడా ఇదే జరిగిన విషయం తెలిసిందే.




 అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకొని ఈ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు గా ప్రకటన చేశారు. దీంతో  భక్తులందరికీ మళ్లీ నిరాశే ఎదురైంది. కానీ ఇవాల్టి నుంచి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో భక్తులందరి లో కొత్త ఉత్సాహం నిండిపోయింది. కరోనా  వైరస్ కారణంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన సమీక్ష లో ఆలయ పునః ప్రారంభానికి నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు ఐదేళ్లలోపు పిల్లలకు వృద్ధులకు మాత్రం అనుమతి లేదు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: