ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి సర్కార్కు రోజురోజుకీ కొరకరాని కొయ్యగా మారి పోతుంది విషయం తెలుస్తుంది. ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు ఒక ఎత్తయితే వైసిపి రెబల్స్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న విమర్శలు మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. ప్రతిపక్ష పార్టీలు సైతం లేవనెత్తిన అంశాలను తెరమీదికి తెచ్చారు రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ పై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. ఇటీవలే మరోసారి జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన రఘురామకృష్ణంరాజు... జగన్ ఇన్ని రోజుల వరకు మగాడు అనుకున్నాను కానీ తన స్థాయిని తగ్గించుకున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు రఘురామకృష్ణంరాజు.




 పార్లమెంటు వెలుపల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించిన వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు... ప్రభుత్వం ప్రజా కంటకంగా ఉంటే ఎప్పటికైనా ప్రజలు ప్రజాప్రతినిధులు అడ్డంకొట్టే  పరిస్థితి వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా అమరావతి పై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అంటూ హితవు పలికారు. ప్రస్తుతం మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునః సమీక్షించి ప్రజల నిర్ణయాలను కూడా తీసుకొని... ప్రజలకు న్యాయం చేసే విధంగా మళ్లీ సరైన నిర్ణయం తీసుకోండి అంటూ సూచించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.



 సీఎం జగన్ ఎంత ధైర్యవంతుడు మగాడు మగాడు అని అనుకున్నాను అని... కానీ ఇలాంటి చర్యలకు పాల్పడి ఆయన స్థాయిని తగ్గించుకుంటారు అని అనుకోలేదు అంటూ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నా స్థాయి పెరుగుతూనే ఉందని కానీ మీ స్థాయి తగ్గడమే బాధగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు. ప్రస్తుతం మీరు ప్రయోగించిన వాళ్లు చిన్న వాళ్ళు ఏమీ కాదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని తద్వారా... మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించి రఘురామకృష్ణంరాజు ప్రజల దృష్టిలో మీరు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలన్నదే తన కోరిక అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: