ఈ నెల 14 వతేదీ నుండి ఎన్నో భద్రతల నడుమ ప్రారంభమయిన పార్లమెంట్ సమావేశాలు చాలా రంజుగా కొనసాగాయి. ఎన్నో అంశాలు ఈ సందర్భంలో చర్చకు వచ్చాయి. కరోనా మహమ్మారి నివారణ ప్రక్రియలు మరియు వ్యాక్సిన్ గురించి కూడా కొన్ని నిర్ణయాలను తీసుకోవడం  జరిగింది. అంతేకాకుండా వ్యవసాయ బిల్లుపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని విపక్షాలు ఒకే తాటిపైకి వచ్చి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని రాష్ట్రాలలో రైతులు ఈ బిల్లులకు వ్యతిరేఖంగా నిరసనలు చేపట్టారు. రాజ్యసభ చైర్మన్ 8 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనితో పార్లమెంట్లో ఒక దశలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. విపక్ష సభ్యులంతా కలిసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ను దింపడానికి  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. ఇంతటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన పార్లమెంట్ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయని తెలిసింది.

 
లోక్‌సభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ సమాచారం ప్రకారం పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నిర్ణయించిన షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందుగానే ఈ సమావేశాలు ముగియనుండడం గమనార్హం. ఈ  విషయంపైన గత శనివారం కేంద్ర ప్రభుత్వం సమావేశంలోనూ ప్రతిపక్షాలతో చర్చించింది. ఇటీవల సమావేశాలకు హాజరైన ముగ్గురు ఎంపీలకు కరోనా వైరస్ రావడంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.కరోనా భయాల మధ్య ఉభయ సభల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. 30 మంది ఎంపీలు కరోనా బారిన పడడంతో లోక్‌సభను వాయిదా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు స్పీకర్‌ ఓంబిర్లా.  పార్లమెంట్‌ సెషన్స్‌కు ముందే లోక్‌సభకు చెందిన 17 మంది ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.అలాగే రాజ్యసభ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. మరి కరోనా వైరస్ బారిన పడిన ప్రజాప్రతినిధులు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్ధిద్దాము.

మరింత సమాచారం తెలుసుకోండి: