ఇక ఇప్పుడిప్పుడే ప్రజలు సంతోషకరమైన జీవితానికి అలవాటు పడుతున్నారు.. పాలన కూడా గాడిలో పరుస్తుంది. ఇక మిగిలి ఉన్న పథకాలపై, ప్రజలకు మేలు జరిగే అంశాలపై జగన్ దృష్టి సారిస్తున్నారు.. అంతేకాదు రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగిన జగన్ ఊరుకోవట్లేదు.కేంద్రానికి లేఖలు, ఫోన్ కాల్ లు సంధిస్తూ వారిని వత్తి చేస్తున్నారు.. ఈ సారి ఆలా కాకుండా జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల ను కలిసిన సంగతి అందరికి తెలిసిందే..
ఢిల్లీ లో రాష్ట్రం యొక్క బాగోగులను చెప్పిన జగన్ ఆ తర్వాత టీడీపీ చేస్తున్న అకృత్యాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమరావతి నుంచి రాజధానిని తరలింపు విషయంలో, అంతర్వేది విషయంలో ఇంకా పలు అంశాల్లో టీడీపీ వ్యవహరిస్తన్నా తీరును పెద్దల సమక్షంలో పెట్టి చంద్రబాబు కుట్ర రాజకీయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. ఇక జగన్ ఢిల్లీ లో ఉండగానే ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి మంచి ప్రకటన వెలువడింది. ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు.