నాలా సొపారా అనే స్లమ్ ఏరియాలో ఉన్నట్టు పోలీసులకి సమాచారం వచ్చింది. దీంతో లక్నోలోని ఠాకూర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్‌ఐ జగదీశ్ ప్రసాద్ పాండే, కానిస్టేబుల్ సంజీవ్ సింగ్‌లను పంపగా... అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేసారు. ఇలా లక్నోకు తీసుకువచ్చేందుకు బయలుదేరగా.... జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 26) వెళ్తున్నప్పుడు మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా సమీపానికి చేరుకోగానే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికీ గాయాలయ్యాయి. ఎస్సై రాజేశ్ కుమార్ సింగ్ విచారణ చేపట్టారు.
ఈ ప్రమాదంలో నేరస్తుడు ఫిరోజ్ మృతి చెందాడు అని అన్నారు. అలానే అతని బావను కూడా అదుపులోకి తీసుకున్నామని, ఈ ప్రమాదంలో అతడి చేయి విరిగిపోయిందని తెలిపారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఫిరోజ్, అఫ్జల్, సంజీవ్‌ను కారు బయటకు నెట్టివేశారని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షులు అయిన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరుగుతున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను యూపీకి తీసుకువచ్చే సమయంలో ఇదే తరహా యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని ఎన్‌కౌంటర్ చేశారు. జులై నెల లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.