టిడిపి కాబోయే రథసారధి నారా లోకేష్  వ్యవహారంపై గత కొంతకాలంగా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏపీ లో టిడిపిని మరింత యాక్టివ్ చేసి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తీసుకువచ్చేందుకు చంద్రబాబు కమిటీలను ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీ లుగా నియమించారు. అదే సమయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి,  టెక్కలి టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పేరును ప్రకటిస్తారని అంత భావించగా, చంద్రబాబు మాత్రం దసరా తర్వాతే కొత్త అధ్యక్షుడు పేరును ప్రకటిస్తారు అని టిడిపి అనుకూల మీడియా ప్రకటించింది. 


ఇదిలా ఉంటే చంద్రబాబు లోకేష్ ఒత్తిడి చేయడంతోనే అచ్చెన్న పేరును ప్రకటించలేదని, ఆ తరువాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అన్ని విషయాల్లోనూ తనను డామినేట్ చేసి మరి అచ్చెన్న వ్యవహరిస్తారని, కీలక నిర్ణయాలు తీసుకోవడంలోనూ తనను ఏ మాత్రం పట్టించుకోరు అని,  రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తరువాత తన ప్రభావం టిడిపిలో పెద్దగా కనిపించని, అప్పుడు తన మాట వినే వారు ఎవరూ ఉండరు అని, రకరకాల అభిప్రాయాలతో చంద్రబాబు పై లోకేష్ ఒత్తిడి చేశారని, ఒత్తిడి కారణంగానే  అచ్చెన్న పేరు చంద్రబాబు ప్రకటించలేదని అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే టిడిపిలో లోకేష్ ,కళా వెంకటరావు మినహా, మిగతా వారంతా అచ్చెన్న అయితేనే  పార్టీని సమర్థవంతంగా నడపగలరు అని, అధికార పార్టీని అచ్చెన్న మాత్రమే ఎదుర్కోగలరని, అనేక రకాలుగా చంద్రబాబును ఒప్పించడంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డారని ప్రచారం జరిగింది.



 ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి కి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే , లోకేష్ మాట పక్కనపెట్టి  త్వరలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న పేరుని ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ రాజకీయ భవిష్యత్తు పై చంద్రబాబుకు భయం ఉన్నా, ఆయన చేతుల్లో పార్టీ పెట్టినా, ఆయన సిఫార్సుతో మరెవరికీ ఆ బాధ్యతలు అప్పగించినా, పార్టీ నాయకుల్లో భరోసా కల్పిస్తూ, అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పైచేయి సాధించలేరు అనే అభిప్రాయంతో చంద్రబాబు లోకేష్ మాటను సైతం పక్కన పెట్టారనే ప్రచారం ఇప్పుడు మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: