కరోనా వైరస్ కష్టకాలంలో అందరూ నలిగి పోతున్న తరుణంలో నేనున్నాను అంటూ తెర మీదికి వచ్చి ఎంతో మందికి ఆపద్బాంధవుడిగా మారిపోయాడు సోనూసూద్. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో అయితే ప్రత్యక్షదైవంగా మారిపోయిన సోనుసూద్.. వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకునేందుకు ఎన్నో సదుపాయాలు కల్పించి తన గొప్ప మనసు చాటుకున్న  విషయం తెలిసిందే. అంతే కాదు ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలిచాడు సోనూ . ఇక వలస కార్మికుల విషయంలోనే కాదు దేశ వ్యాప్తంగా సహాయం కావాలి అన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాడు.



 సినిమాల్లో విలన్ పాత్రలు చేసినప్పటికీ నిజజీవితంలో అసలు సిసలైన హీరో అనిపించుకున్నాడు సోనూ . విద్యార్థుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ వారికి కూడా అండగా నిలబడేందుకు ముందుకు కదులుతున్నాడు. ఇప్పటికే ఒక ట్రస్టు ద్వారా ఎంతోమంది మెరుగైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందించేందుకు నిర్ణయించారు సోనూ . అంతేకాదు కరోనా కష్టకాలంలో ప్రైవేట్ కాలేజీ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఇటీవలే కోరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విద్యార్థులకు అండగా నిలబడేందుకు మరోసారి ముందుకు వచ్చారు.



 విద్యార్థుల పాలిట ఆపద్బాంధవుడిగా మారిపోయాడు సోను సూద్.  బీహార్ అస్సాం గుజరాత్ రాష్ట్రాలలో ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా రోజురోజుకు వరద బాధితులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం ప్రభుత్వాలు వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యేందుకు వరద బాధిత ప్రాంతాలలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి విద్యార్థులకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చిన సోనుసూద్... జెఈఈ నీట్  పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చాడు. ఏ ఒక్క విద్యార్థి కూడా పరీక్ష మిస్ అవ్వటానికి  వీలు లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: