కరోనా వైరస్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాటం చేస్తున్న వైద్యులందరికీ మరింత చేయూత అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణలో.. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్యుల విషయంలో కూడా... ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ వైద్యులందరికీ శుభవార్త అందించింది.
కరోనా వైరస్ కష్టకాలంలో... ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులకు వారి కుటుంబాలకు మేలు జరిగే విధంగా జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని శుభవార్త అందించింది. కరోనా నియంత్రణలో భాగంగా వైద్యులు కోవిడ్ డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోతే సదరు వైద్యుని కుటుంబంలో ఒకరికి కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కరోనా పోరాటంలో వైద్యుడు మృతిచెందిన వెంటనే ఆ వివరాలు జిల్లా వైద్యాధికారి కి పంపాలి అంటూ తెలిపిన ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు అందిన వెంటనే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.