ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఒక ఉపాధ్యాయుడు కారణంగా ఏకంగా విద్యార్థులు మృత్యువుతో పోరాడాల్సి వచ్చింది. ఉపాధ్యాయుడు నిర్లక్ష్యం ఏకంగా కరోనా వైరస్ బారిన పడేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక ఉపాధ్యాయుడు కారణంగా 15 మంది పిల్లలకు కరోనా వైరస్ సోకటమే కాదు వారి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇక 15 మంది విద్యార్థులకు ఒకేసారి కరోనా వైరస్ సోకడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బాగా చదువుకోవడానికి ట్యూషన్ కి వెళ్లిన పిల్లలు చివరికి కరోనా వైరస్ బారిన పడటం స్థానికంగా అందరిలో ఆందోళన కలిగించింది. సత్తెనపల్లి లోని భట్లూరు గ్రామంలో... ఉపాధ్యాయుడు ట్యూషన్ క్లాస్ నిర్వహించాడు. అయితే సదరు ఉపాధ్యాయుడికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేశాడు. అయితే ప్రభుత్వం ఎలాంటి ట్యూషన్లు నిర్వహించకూడదని నిబంధన పెట్టినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ట్యూషన్ నిర్వహించాడు. చివరికి ఆ ఉపాధ్యాయుడు కారణంగా ట్యూషన్ కి వచ్చిన పదిహేను మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారు. అంతేకాదు వారి తల్లిదండ్రులకు కూడా కరోనా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ నిర్వహించిన ఉపాధ్యాయుడిపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు.