ప్రస్తుతం ఆన్లైన్లో ప్రపంచం పరుగులు పెడుతోంది. ఏం కావాలన్నా అరచేతిలో వాలిపోతుంది. దీంతో ప్రస్తుతం యువత కొత్త పోకడలకు పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆన్లైన్ యుగంలో కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన ఘటనలు కూడా తెరమీదికి వస్తూ ఉంటాయి. ఇక ఇలా తెర మీదికి వచ్చిన ఘటనలు చూసి... నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఆన్లైన్ లో ఎన్నో డేటింగ్ యాప్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. యువతను ఆకర్షించేందుకు ఎన్నో డేటింగ్ యాప్ లు  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇక్కడ ఒక యువకుడు ఏకంగా ప్రియురాలి కోసం సోషల్ మీడియా లో తనని తాను అమ్మకానికి పెట్టుకున్నారు.



 ఈ ఆసక్తికర ఘటన  బ్రిటన్ లో చోటుచేసుకుంది. అలెన్ క్లెటన్ అనే  యువకుడు ఎన్నో డేటింగ్ యాప్ లలో  ఒక జోడి కోసం వెతికాడు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్ అయిన సదరు యువకుడికి... ఎన్ని డేటింగ్ యాప్ లలో వెతికినప్పటికీ ప్రియురాలు మాత్రం దొరకలేదు. ఇక వెతికి వెతికి చివరికి విసిగి పోయాడు. చివరికి వినూత్న ఆలోచన చేసి తనను తానే అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు సదరు వ్యక్తి. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక ప్రకటన కూడా చేశాడు. నా పేరు అలెన్... వయసు 30 సంవత్సరాలు... అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను... ఇకనుంచి అన్ని వేడుకలకు ఒంటరిగా వెళ్లాలి అనుకోవడం లేదు.. అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఆసక్తికరంగా ఒక ప్రకటన చేశాడు.



 అయినప్పటికీ సదరు యువకుడికి మాత్రం ఆ అదృష్టం కలిసి రాలేదు. చాలామంది అమ్మాయిలు అతనితో మాట్లాడినప్పటికీ అది డేటింగ్ చేసేంతవరకు మాత్రం రాలేదు. ఇక క్లేటన్ చేసిన విచిత్ర ప్రకటన ఏకంగా తండ్రిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తండ్రి ఇక కొడుకుని ప్రోత్సహించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తన కొడుకు ఎంతో మంచి వాడని... చెప్పిన మాట వింటాడని... ఇంట్లో అంట్లు తోమడం వంట చేయడం అన్నీ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు సదరు యువకుడి  తండ్రి. మరి ఇకనైనా సదరు యువకునికి అమ్మాయి దొరుకుతుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: