
మొదటి నుంచి కాంగ్రెస్ వారీగా ఉంటూ వచ్చిన సబ్బంహరి, ఒక దశలో కాంగ్రెస్ బహిష్కరణకు గురయ్యారు. ఆ తరువాత కెవిపి రామచంద్ర రావు చలువతో సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో 2009లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొంది వైసీపీలో చేరారు. జగన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఆయన్ని మించిన నాయకుడు మరొకరు ఉండరు అంటూ పదేపదే హడావుడి చేశారు. జగన్ పార్టీ పెట్టిన మొదట్లో ఆయన వెంట నడిచిన నాయకుల్లో ఒకడిగా సబ్బం హరికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. కానీ రాను రాను జగన్ కంటే తానే ఎక్కువ అన్న రేంజ్ లో సబ్బం హరి వ్యవహరించడం వంటి పరిణామాలు జగన్ కు ఆగ్రహం తెప్పించింది.
అప్పటి నుంచి పార్టీలో సబ్బంహరి ప్రాధాన్యత తగ్గుతూ రావడంతో ఆయన వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని కూడా అప్పట్లో జోస్యం చెప్పడంతో జగన్ కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. టిడిపి నుంచి భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నా, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా, జగన్ పై తనకున్న కోపాన్ని అప్పుడప్పుడూ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
ప్రస్తుతం ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్మించిన బిల్డింగ్ వ్యవహారంలో ఇప్పుడు కూల్చివేతలు కు జిహెచ్ఎంసి పాల్పడడంతో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది.ఈ వ్యవహారమే కాకుండా, గతంలో ఆయన విశాఖ మేయర్ గా పనిచేసిన సమయంలో చోటు చేసుకున్న అనేక అవినీతి అక్రమాలపై వైసీపీ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేయించి, ఆయనను మరింత ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.