రస్సెల్ లాంటి మంచి హిట్టర్ ఉన్నప్పటికీ కూడా కోల్కతా జట్టు ఎక్కువగా ఉపయోగించుకోలేక పోతుంది. గత సీజన్లో ప్లే ఆప్స్ కు కూడా చేరుకోలేకపోయింది. అయితే ఇంగ్లాండ్కు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు కలకత్తా నైట్ రైడర్స్ జట్టు బాధ్యత ఇస్తే ఎంతో విజయవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే మొదట్లో జట్టు బాధ్యతలు ఇయాన్ మోర్గాన్ కి ఇస్తారు అనుకున్నప్పటికీ ఎవరూ ఊహించని విధంగా దినేష్ కార్తిక్ కి అప్పగించారు.
కెప్టెన్ గా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన దినేష్ కార్తీక్ కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇక ఇయాన్ మోర్గాన్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే సారథిగా దినేష్ కార్తీక్ వ్యూహాలు కూడా ఎవరికీ నచ్చడం లేదు. రాహుల్ త్రీపాటీని 8 వ స్థానంలో పంపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు అసలు రాణించ లేకపోతున్నా సునీల్ నారాయణ్ ను పదేపదే ఓపెనర్గా పంపుతూ ఉండటంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా దినేష్ కార్తీక్ మార్చి ఇయాన్ మోర్గాన్ కి పట్టాలు అప్పగించాలని డిమాండ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.