ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిగినప్పటికీ ఎక్కడా చర్చలు మాత్రం సఫలం కాలేదు. ఒకవేళ చర్చలు సఫలమయ్యి   ఇరు దేశాల మధ్య ఒప్పందాలు  కుదిరినా.. చివరికి చర్చల అనంతరం చైనా మరోసారి సరిహద్దుల్లో తోక జాడిస్తూనే  ఉంది. అయితే మొదట ఆత్మరక్షణ వ్యూహాన్ని అమలు చేసిన భారత ఆ తర్వాత చైనా కు షాక్ ఇచ్చే విధంగా అద్భుత వ్యూహాన్ని అమలు చేస్తూ ఏకంగా చైనా వ్యూహాత్మక ప్రదేశాలను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రస్తుతం శీతాకాలం పర్వతాలపై మంచు కురుస్తున్నప్పటికీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మిషన్  చేపట్టి.. 50 వేల మంది సైనికులను మంచు  కురుస్తున్న ప్రాంతంలోనే చైనా కు దీటుగా నిలబెట్టింది భారత్.



 అదే సమయంలో ప్రస్తుతం భారీగా ఆయుధాలను కూడా సరిహద్దుల్లో మోహరిస్తుంది  భారత్.  అయితే మంచు కురిసే సమయంలో భారత్  వెనక్కి తగ్గుతుందని చైనా ఊహించినప్పటికీ  భారత్ మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా మంచు కురుస్తున్నప్పటికీ ఎంతో దీటుగా నిలబడుతుంది. ఇప్పటికే భారత్ ఎన్నో యుద్ధ విమానాలను యుద్ధ ట్యాంకులను... అత్యాధునిక ఆయుధాలను సరిహద్దుల్లోకి చేర్చిన  విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన తట్టుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దులకు దగ్గరగా ఏకంగా  ఆరువేల ట్రక్కులను  కూడా ఉంచినట్లు  ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.




 ప్రస్తుతం సరిహద్దులో ఉన్న మంచుకురిసే పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో ట్రక్కులు నడిచేందుకు వీలు లేదు. కానీ ఒకవేళ చైనాతో యుద్ధం గనుక జరిగితే భారత్ కి  భారీగా ఆయుధాలను పంపిణీ చేయడంతో పాటు ఆహారాన్ని కూడా భారీగానే పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో  భాగంగా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు... కేంద్ర ప్రభుత్వం ఆరు వేల ట్రక్కులను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో సైతం శరవేగంగా ఆయుధాలను... ఆహారాన్ని కూడా సైనికులు అందరికీ అందించేందుకు వీలు ఉంటుందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత వ్యూహంతో  చైనా కు భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: